ఎస్ఎంఎస్, వాట్సాప్ లో కేవైసీ ధ్రువీకరణ పేరుతో వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకూడదని ప్రకాశం ఎస్పీ దామోదర్ హెచ్చరిస్తున్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడుతూ కేవైసీ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపించవన్నారు. మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్ నెంబర్, ఓటిపి లాంటి వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దని తెలియజేశారు. ఏదైనా అనుమానాస్పద లింక్ వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయాలని తెలిపారు.