రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సంతమాగులూరు మండలం అల్చూరులోని పెట్రోల్ బంక సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బల్లికువ మండలం కొప్పెరపాడుకు చెందిన మహిళ నరసరావుపేటకి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ వెనుక టైర్లు చున్నీ చుట్టుకోవడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.