తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్

78చూసినవారు
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
AP: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని వేసవి రద్దీ వేళ బ్రేక్ దర్శనాల్లో ఐఏఎస్, ఐపీఎస్‌ల సిఫారసు లేఖలను రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బ్రేక్ దర్శనాలు వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్న అంశంపైన టీటీడీ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే వచ్చే వారం నుంచి బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్