IPL-2025లో భాగంగా శుక్రవారం RCB, CSK జట్ల మధ్య 8వ లీగ్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో RCB విజయం సాధించింది. ఈ క్రమంలో CSK మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని మరో అరుదైన ఘనతను సాధించారు. IPL చరిత్రలో CSK జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా(4,687) పేరిట ఉన్న రికార్డును ధోని(4,699) బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో ఫాఫ్ డుప్లెసిస్(2,721), రుతురాజ్ (2,433*) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.