ఏపీలోని కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బద్వేల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో 4వ తరగతి విద్యార్థినితో ఓ కీచక ఉపాధ్యాయుడు అన్వర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు విద్యార్థిని తన తల్లిదండ్రులకు ఈ విషయం గురించి చెప్పగా.. కీచక ఉపాధ్యాయుడిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సదరు టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.