యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బిజ్నోర్ జిల్లా చాంద్‌పూర్‌లో వేగంగా వచ్చిన ట్రక్కు బైక్ నడుపుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ రైడర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.