కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జిను ప్రారంభించనున్న మోదీ

53చూసినవారు
ఏప్రిల్ 6 శ్రీరామనవమి సందర్భంగా కొత్త పంబన్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ లో ప్రయాణిస్తూ సముద్ర అందాలను చూసే అవకాశం ఉంటుంది. రామేశ్వరం మండపం-ద్వీపం మధ్య రూ.530 కోట్లతో నిర్మించిన కొత్త పంబన్ బ్రిడ్జికి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. పాత బ్రిడ్జికి వందేళ్లు పూర్తి కావడంతో శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన బ్రిడ్జిని నిర్మించారు. కొత్త పంబన్ బ్రిడ్జి 2.10 కిలోమీటర్ల మేర నిర్మించారు.

సంబంధిత పోస్ట్