మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామంలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని దోర్నాల ఎస్సై మహేష్ శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 21 క్వాటర్ల మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా మహేష్ చెప్పారు. మండలంలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రజలను హెచ్చరించారు.