త్రిపురాంతకం: బెంబేలెత్తించిన త్రాచుపాము

56చూసినవారు
త్రిపురాంతకం: బెంబేలెత్తించిన త్రాచుపాము
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రామసముద్రంలో గురువారం ఓ త్రాచు పాము ప్రజలను హడలెత్తించింది. ఎస్సీ కాలనీలో పాము తిరుగుతుండగా స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ మల్లికార్జున త్రాచుపామును చక్క చక్కగా బంధించారు. తర్వాత స్థానిక నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ మల్లికార్జున ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్