ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరయ్యారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఆయన నివాళులు అర్పించారు. జ్యోతి రావు పూలే అడుగుజాడలు మనందరికీ ఆదర్శమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.