త్రిపురాంతకం: ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
త్రిపురాంతకం మండలంలోని గ్రంధాలయంలో సోమవారం 16వ జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్, తెలుగు అధ్యాపకులు, శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో డా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య సేవలను కొనియాడారు.