బెల్లంపల్లి: దేవాలయ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని వినతి

64చూసినవారు
బెల్లంపల్లి: దేవాలయ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని వినతి
బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదుట గల శ్రీ సంజీవని హనుమాన్ దేవాలయ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొంతమంది పట్టపగలు దేవాలయ భూములు ఆక్రమించడానికి రెండు జేసీబీలతో చదును చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయ భూములను కబ్జాదారుల నుంచి కాపాడి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్