ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుతాయి
ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెంలో శనివారం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.