ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంక్రాంతికి కేరళ తరహాలో పడవల పోటీలు

83చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంక్రాంతికి కేరళ తరహాలో పడవల పోటీలు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ తరహాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ పేరుతో పడవ, ఈత పోటీలు ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరితో పాటు అనంతపురం, విశాఖ, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. వీటితో పాటే మహిళలకు రంగవల్లులు, గాలిపటాల పోటీలు నిర్వహించనున్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్