ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా (వీడియో)

63చూసినవారు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కామాక్షి ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట మీదుగా కందుకూరుకు వెళ్తోంది. లింగంగుంట్ల వద్ద కారును తప్పించబోయి బస్సు బోల్తా కొట్టి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్