ప్లాట్‌ఫాంపై క్యూలైన్‌ విధానం.. విజయవాడ స్టేషన్‌లో అమలు

82చూసినవారు
ప్లాట్‌ఫాంపై క్యూలైన్‌ విధానం.. విజయవాడ స్టేషన్‌లో అమలు
రైళ్లలోని జనరల్ బోగీల్లో ఎక్కే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంలపై క్యూలైన్ విధానాన్ని అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో జనరల్ బోగీలు ఆగేచోట ప్లాట్‌ఫాంలపై క్యూలైన్‌లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ నుంచి బయలుదేరే పలు రైళ్లకు తొలుత ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో రద్దీ వేళల్లో జనరల్‌ బోగీల్లో ప్రయాణికుల మధ్య తోపులాట, వాగ్వాదం, ఘర్షణలకు తావు ఉండదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్