AP: సంక్రాంతి వచ్చిందంటే చాలు వైసీపీ నేత అంబటి రాంబాబు డాన్స్‌లతో జోష్ తెప్పించేవారు. గతేడాది తన డాన్స్‌తో సంక్రాంతి రాంబాబుగా నిలిచిన ఆయన ఈ సారి సైలెంటుగా ఉన్నారు. వైసీపీ అధికారంలో లేకపోవడం, తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో దూరంగా ఉన్నట్లు తెలిసింది. గతంలో ఆయన చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.