యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు రామ్ కాంబోలో వస్తున్న మూవీని శర్వా 37 పేరుతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి టైటిల్ ‘నారీనారీ నడుమ మురారీ’ అని ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీలో కథానాయికలుగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు. అయితే శర్వానంద్ కెరీర్‌లో మంచి విజయం కోసం ఎదరూచూస్తున్నాడు. మరి ఈ మూవీ అయినా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.