KTR దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు రేపు విచారణ జరపనుంది. ఫార్ములా -ఈ రేసు కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆ కేసును కొట్టేయాలని కేటీఆర్ ఈనెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంతో అత్యున్నత ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వనుందో అని బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.