తిరుమలలో భక్తుల రద్దీ చాలా తగ్గింది. వరుస సెలవులు ముగియడంతో శ్రీవారిని దర్శనానికి జనం ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి చూస్తున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.