AP: ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు రూ.7546.34 కోట్ల చెల్లింపులు జరిపామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ తెలిపారు. డీబీటీ పథకాల నిమిత్తమే రూ.5866.26 కోట్లు విడుదల చేశామని చెప్పారు. కేంద్ర పథకాలు, అప్పులు, జీతాలు, పెన్షన్లు, పాలనాపరమైన ఖర్చులు, తదితర వాటికి మిగతా మొత్తం చెల్లించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఫైనాన్స్ కోడ్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నామన్నారు.