AP: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు మరోసారి హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలనే కోర్టు పొడిగించింది. మళ్లీ శుక్రవారం వరకు ఈ ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు వర్మపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.