ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇస్మాయిలీ ముస్లింల 49వ ఇమామ్ అగాఖాన్(88) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈనెల 5న ఆయన మరణించారు. ఈజిప్ట్‌లోని అస్వాన్‌లో ఆదివారం రాత్రి భౌతికకాయాన్ని ఖననం చేశారు. స్విట్జర్లాండ్‌లో జన్మించిన ఆయన 1967లో అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా వందలాది ఆస్పత్రులు, పాఠశాలలు, పేదలకు ఇళ్లు నిర్మించారు. ఆయన సేవలకుగానూ 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.