బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఎయిర్ షో ప్రారంభమైంది. ఈ ఎయిర్ షో వీక్షణకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ హాజరైయ్యారు. ఫిబ్రవరి 14 వరకు ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ కొనసాగనుంది. 90 దేశాల నుంచి 150 కంపెనీలు పాల్గొంటున్నాయి. 900 ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. అమెరికా, రష్యా తదితర దేశాల యుద్ధవిమానాల విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి.