రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారుల మరమ్మతులకు రూ.1,121.85 కోట్లు అవసరమవుతాయని ఇంజినీర్లు అంచనాలు వేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు రూ.258.85 కోట్లు, మిగిలిన పనుల పూర్తికి మరో రూ.863 కోట్లు కావాలని ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. నెల్లూరు, విజయనగరం, ఏలూరు, కృష్ణా, చిత్తూరు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో రహదారుల సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.