AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సజ్జల భార్గవ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. చంద్రబాబు, పవన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. సజ్జల భార్గవ్‌ను అరెస్ట్ చేయవద్దని గత విచారణలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరో ఏడు రోజుల పాటు ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.