కేంద్రంపై షర్మిల ఫైర్‌

57చూసినవారు
కేంద్రంపై షర్మిల ఫైర్‌
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోమని చెప్పి దాన్ని బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా? అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఆరు వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ముడిపదార్థాలు నిండుకున్నాయని, ఈ నెల జీతాలు ఇవ్వడం కష్టమేనని యాజమాన్యం చేతులెత్తేస్తుంటే.. మోడీకి కనీసం చీమైనా కుట్టినట్లు లేదని షర్మిల మండిపడ్డారు. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్