ఆర్టీసీ బస్సులో శుక్రవారం ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రయాణించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న హామీ ఏమైందని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. 'తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వారంలోనే ఉచిత ప్రయాణం పథకం అమలు చేశారు. కర్ణాటకలోనూ దీనిని అమలు చేస్తున్నారు. మీరు 4 నెలలు అవుతున్నా ఎందుకు? అమలు చేయడం లేదు. ఈ పథకాన్నే అమలు చేయడం లేదంటే ఇంకా పెద్ద స్కీములను ఎలా అమలు చేస్తారు?' అని కూటమి ప్రభుత్వంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.