వైసీపీకి షాక్‌.. నిడదవోలు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న జనసేన

78చూసినవారు
వైసీపీకి షాక్‌.. నిడదవోలు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న జనసేన
AP: తూ.గో జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఇందులో 27 మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. గత నెల 20వ తేదీన వైసీపీ కౌన్సిలర్లు 17 మంది సంతకాలతో ఛైర్మన్‌ ఆదినారాయణపై కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే, ఆ నోటీసు ఇచ్చినవారిలో ముగ్గురు కౌన్సిలర్లు జనసేనలో చేరడంతో.. నోటీసును జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తిరస్కరించారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్