ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్స్ తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో మొత్తం మూడు షోరూంలను ప్రారంభించగా.. అందులో రెండు హైదరాబాద్, వరంగల్‌లో ఒకటి చొప్పున ప్రారంభించారు. అలాగే ఈ షోరూంలో రోర్ ఈజెడ్ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 30 మందికి కాంప్లిమెంటరీగా బంగారు నాణెం అందిస్తున్నట్లు సీఈవో మధుమిత అగర్వాల్ వెల్లడించారు. వీటి ధర రూ.89,999గా ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 175 కి.మీ రేంజి ఇస్తుంది.