వైఎస్సార్ జిల్లాలో పలువురు ఎంపీడీవోలకు జడ్పీ సీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిన్న పింఛన్ల పంపిణీ ఉదయం 8 గంటలకు ప్రారంభించకపోవడం వల్లే నోటీసులు జారీ చేసినట్లు జడ్పీ సీఈవో తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బందికి సమయం నిర్దేశించలేదని, 5 రోజుల్లో షోకాజ్ నోటీసులకు సంజాయిషీ ఇవ్వాలని శనివారం పలువురు ఎంపీడీవోలను ఆదేశించారు.