ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలికలు ఏర్పడ్డాయి. సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆస్కార్ రావు మాట్లాడుతూ.. ‘సూర్యనారాయణ వల్ల సంఘంపై అనేక కేసులు ఉన్నాయి. సంఘం కొత్త అధ్యక్షుడిగా డి.శ్రీకాంత్‌ను నియమిస్తున్నాం’ అని అన్నారు.