కోలాటంతో ఎమ్మెల్యే మేకపాటి కి ఘన స్వాగతం

75చూసినవారు
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి శనివారం ఏ ఎస్ పేట మండలంలో పర్యటించారు. ఆయనకు కోలాట ప్రదర్శనతో సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన వైయస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దేనని విక్రమ్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :