నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఏఎస్ పేట దర్గాలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇటీవల దర్గాలో గంధ మహోత్సవం జరిగిన కారణంగా కుప్పలు కుప్పగా చెత్తాచెదారం పేరుకుపోయింది. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా దర్గా ప్రాంతాన్ని ఈవో షేక్ మహమ్మద్ హుస్సేన్ సిబ్బందితో కలిసి శనివారం శుభ్రం చేశారు. అలాగే అక్కడున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.