ఆత్మకూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజ రెడ్డి శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని మేదర వీధి ప్రాంతంలో పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పెన్షన్ దారుల పట్ల ఉన్న ప్రేమతో ఒక్కరోజు ముందుగా పెన్షన్ల పంపిణీ చేశామని దేశంలో ఎక్కడా కూడా ఇలా ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చిన చరిత్ర లేదని తెలిపారు.