జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదల సందర్భంగా.. టీమ్ తారక్ ట్రస్ట్ సౌజన్యంతో ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన నిస్సాయ స్థితిలో ఉన్న మూడు కుటుంబాలకు నాణ్యమైన బియ్యం, నిత్యవసర సరుకులు, పండ్లు మొదలగునవి అందజేయడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ వీరాభిమాని, ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమన్నారు.