హైదరాబాదు నుండి కందుకూరు కు ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారిని చిలకలూరిపేట వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. బస్సులో 40 మంది ప్రయాణికులు వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.