సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంది కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఉలవపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం పర్యటించారు. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.