కందుకూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ డివి శివరాం, ఆయన సతీమణి సౌజన్య తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. టిడిపి ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే దంపతులు సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. కందుకూరు నియోజకవర్గం లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నారు.