నెల్లూరు జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. దగదర్తి మండలం తడకలూరు గ్రామానికి చెందిన పోలయ్య (46), నరసయ్య (21) పొలం పనులకు వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ తో మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొలం పనులకు వెళ్లినవారు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు.