కొడవలూరు: స్మశానానికి దారి లేక అవస్థలు

83చూసినవారు
కొడవలూరు: స్మశానానికి దారి లేక అవస్థలు
కొడవలూరు మండలంలోని బొడ్డువారిపాలెం గ్రామంలో వృద్ధుడు ఆదివారం మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన స్మశానానికి దారిలేక పంటపొలాల్లో మోకాళ్ళ లోతు బురదలో అతికష్టం మీద మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించారు. గతంలో 15 అడుగులు వెడల్పు ఉన్న స్మశానం దారిని రైతులు ఆక్రమించడంతో 2 అడుగుల వెడల్పు దారిగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్