నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ తాగి అస్వస్థతకు లోనైన రెండేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. నెల్లూరు నగరంలోని ఇరుగాళ్లమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా దంపతుల కుమారుడు కాలేషా. ఈ నెల 7వ తేదీ సాయంత్రం వాటర్ బాటిల్లో అడుగున ఉన్న పెట్రోల్ ను తాగడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన తల్లి బాలుడిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.