బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి నెల్లూరు నగరంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోజువారి కూలీలతో పాటు సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. వరుసగా మూడు రోజుల పాటు జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక ఉండడంతో మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.