కొడవలూరు మండలం యల్లాయపాలెం గ్రామంలోని తాళ్లమెట్ట ఎస్టీ కాలనీలో పొట్లూరు పోలయ్య అనే వ్యక్తిని (65) కన్న కొడుకు చంపిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. యల్లయ్యపాలెం గ్రామంలో పొట్లూరు పోలయ్య కుటుంబంతో సహా కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహల నేపథ్యంలో ఓ చిన్న గొడవ జరుగుతున్న సమయంలో ఉదయం కుమారుడు సుబ్రహ్మణ్యం తండ్రి పోలయ్యను గొడ్డలితో నరికి అక్కడ నుండి పరారయ్యాడు.