ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని కాపు భవన్ లో ఉత్తమ మార్కులు సాధించిన బలిజ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను మంత్రి ప్రారంభించారు.