నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు లోన్ సౌకర్యం కల్పించాలని, ఇళ్ల స్థలాలు లేనటువంటి కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.