ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని కావలి దళితవాడలో బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. ఆయనకు గ్రామస్తులకు ఘనంగా స్వాగతం పలికారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య స్వామి కళ్యాణం జరిగింది.