విక్రమ సింహపురి యూనివర్సిటీలోని మెరైన్ బయోలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవంను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కరరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..“సముద్ర జీవ వ్యవస్థల పరిరక్షణ, శాశ్వత మత్స్యకర్షణ ప్రాథమిక అవసరాలు అనే అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.