నాయుడుపేట: దోమల నివారణకు ఫాగింగ్
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు చేపట్టడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా సోమవారం సాయంత్రం తెలిపారు. ఇటీవల వర్షాలు కురవడంతో దోమల బెడద అధికమవ్వడంతో మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు దోమల నివారణకు ఫాగింగ్ చేయించారు. ప్రధాన డ్రైనేజీ కాలువల్లోను సైతం దోమలు వృద్ది చెందకుండా నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.