రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చోటుచేసుకున్న అత్యంత భీకరమైన ఘర్షణ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా నిలిచిన ఈ యుద్ధం మంగళవారంతో 1000 రోజుకు చేరుకుంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు చేపట్టిన సైనిక చర్య.. కీవ్‌లో వినాశనానికి దారితీసింది. పరస్పర క్షిపణి దాడులతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లో అనేక నగరాలు ధ్వంసమయ్యాయి.